టెస్టు చాంపియన్ షిప్ లో టీమిండియా పైపైకి...!

  • దక్షిణాఫ్రికాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీ సేన
  • భారత్ ఖాతాలో 240 పాయింట్లు
  • 60 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్
విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ లో దూసుకుపోతోంది. ఇటీవలే వెస్టిండీస్ ను చిత్తు చేసి చాంపియన్ షిప్ కు శ్రీకారం చుట్టిన భారత జట్టు తాజాగా దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దాంతో టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ప్రథమస్థానంలో ఉన్న టీమిండియా ఖాతాలో 240 పాయింట్లు ఉండగా, రెండో స్థానంలో న్యూజిలాండ్ ఖాతాలో 60 పాయింట్లు ఉన్నాయి. కాగా, సొంతగడ్డపైనే బంగ్లాదేశ్ తో టీమిండియా వచ్చే నెలలో 2 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ లోనూ గెలిస్తే కోహ్లీ సేన టాప్ ప్లేస్ మరింత పదిలమవుతుంది.
Go Back to Shorts
India
ICC
Test Championship

More Telugu News